Skip to main content

Yuki Bhambri: ఏటీపీ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్..

భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ తన కెరీర్‌లో రెండో ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
Yuki Bhambri wins ATP 250 BMW Open men's doubles title

బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన అల్బానో ఒలివెట్టితో కలిసి ఆడుతూ యూకీ విజయం సాధించాడు.

ఉత్కంఠభరితమైన ఫైనల్లో యూకీ-ఒలివెట్టి జంట ఆండ్రియా మీస్-లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) జోడీపై 7-6 (8/6), 7-6 (7/5)తో గెలుపొందింది. ఈ విజయంతో యూకీ-ఒలివెట్టి జోడీకి 30,610 యూరోల (రూ. 27 లక్షల 16 వేలు) బహుమతి డబ్బు, 250 ATP పాయింట్లు లభించాయి.

గత ఏడాది.. యూకీ మలోర్కా ఓపెన్‌లో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి తన మొదటి ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

2024 Miami Open: సినెర్‌ ఖాతాలో మయామి మాస్టర్స్‌ టైటిల్‌

Published date : 22 Apr 2024 05:30PM

Photo Stories