International Cricket Council: అండర్–19 వరల్డ్‌కప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
2022 ఐసీసీ అండర్–19 క్రికెట్ వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ టోర్నీ.. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్స్‌తో ముగుస్తుంది. తొలి మ్యాచ్‌లో కరీబియన్ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. జనవరి 15న గ్రూప్–బిలో తమ తొలి పోరులో యశ్ ధుల్ సారథ్యంలోని భారత అండర్–19 జట్టు దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధమైంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడతాయి. ట్రినిడాడ్, అంటిగ్వా, సెయింట్ కిట్స్, గయానా నగరాల్లోని మొత్తం 9 వేదికల్లో 23 రోజుల పాటు ఈ యువ మెగా టోర్నీ జరుగనుంది.
గ్రూప్–బిలో భారత్..
గ్రూప్–ఎ: బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, యూఏఈ; గ్రూప్–బి: భారత్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండ; గ్రూప్–సి: జింబాబ్వే, అఫ్గానిస్తాన్, పపువా న్యూగినియా, పాకిస్తాన్; గ్రూప్–డి: స్కాట్లాండ్, శ్రీలంక, విండీస్, ఆస్ట్రేలియా.
చదవండి: Sports calendar 2022: ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అండర్–19 క్రికెట్ వరల్డ్‌కప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)
ఎక్కడ : వెస్టిండీస్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్