Wrestling Federation of India: భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు
ప్రస్తుతం డబ్ల్యూఎఫ్‌ఐ రోజువారీ వ్యవహారాలను అడ్‌హక్ కమిటీ నిర్వహిస్తోంది. తాజా సస్పెన్షన్‌తో భారత రెజ్లర్లకు పెద్ద చిక్కే వచ్చిపడింది. వాళ్లు పోటీపడేందుకు ఇబ్బంది లేకపోయినా అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకం గెలిస్తే మన త్రివర్ణ పతాకం ఎగురదు. భారత రెజ్లర్లు యూడబ్ల్యూడబ్ల్యూ జెండా కిందపోటీ పడాల్సి ఉంటుంది. వచ్చే నెల 16 నుంచి జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగుతారు. వాస్తవానికి గత జూలై 11న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు జరగాలి. అయితే గువాహటి హైకోర్టు స్టే విధించడంతో వాయిదా పడ్డాయి. అనంతరం ఆగస్టు 7కు మరో వాయిదా! అంతలోనే మళ్లీ 12కు జరిపారు. సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు పంజాబ్–హరియాణా హైకోర్టు స్టే కారణంగా 12న జరగాల్సిన ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి.
Wrestling World Championships: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా పంఘాల్