Tennis: మెక్సికో ఓపెన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన ఆటగాడు?
2022 మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ విజేతగా అవతరించాడు. ఫిబ్రవరి 27న మెక్సికోలోని అకాపుల్కో నగరంలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలిచాడు. చాంపియన్ నాదల్‌కు 3,14,455 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 36 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నాదల్ కెరీర్‌లో ఇది 91వ సింగిల్స్ టైటిల్‌కాగా... 2022 ఏడాది మూడోది. మెల్‌బోర్న్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ నాదల్ విజేతగా నిలిచాడు. మెక్సికో రాజధాని నగరం పేరు మెక్సికో సిటీ.
బల్గేరియా రాజధాని నగరం పేరు?
బల్గేరియా రాజధాని సోఫియా వేదికగా ఫిబ్రవరి 27న ముగిసిన స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ నందిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చండీగఢ్‌కు చెందిన నందిని ప్లస్ 81 కేజీల సెమీఫైనల్లో 0–5తో లాజత్ కుంగిబయెవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయింది.
చదవండి: అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 మెక్సికో ఓపెన్‌లో టెన్నిస్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించిన ఆటగాడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్
ఎక్కడ : అకాపుల్కో, మెక్సికో
ఎందుకు : పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్