Tennis: అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో చిలకలపూడి శ్రావ్య శివాని–షర్మదా బాలు (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫిబ్రవరి 26న జరిగిన డబుల్స్ ఫైనల్లో శ్రావ్య శివాని–షర్మదా బాలు ద్వయం 3–6, 1–6తో రెండో సీడ్ పునిన్ (థాయ్‌లాండ్)–అనా ఉరెకె (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాగాల వెంకట్ రాహుల్ ఏ క్రీడలో పేరొందాడు?
సింగపూర్ అంతర్జాతీయ టోర్నీలో 96 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ కాంస్య పతకం గెలిచి, 2022 జూలై–ఆగస్టులో బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. రాహుల్ మొత్తం 328 కేజీలు (స్నాచ్‌లో 149+క్లీన్ అండ్ జెర్క్‌లో 188) బరువెత్తాడు. భారత్‌కే చెందిన వికాస్ (339 కేజీలు) స్వర్ణం, బరెడో (ఆస్ట్రేలియా–336 కేజీలు) రజతం గెలిచారు.
PVL 2022: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించిన జట్టు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : చిలకలపూడి శ్రావ్య శివాని–షర్మదా బాలు (భారత్) జోడీ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
ఎందుకు : ఫైనల్లో శ్రావ్య శివాని–షర్మదా బాలు ద్వయం 3–6, 1–6తో రెండో సీడ్ పునిన్ (థాయ్‌లాండ్)–అనా ఉరెకె (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైనందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్