ICC Suspends Sri Lanka Cricket Board: శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసిన ఐసీసీ
శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు... ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఈనెల 21న ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుందని, ఆ తర్వాతే శ్రీలంక బోర్డు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఐసీసీ తెలిపింది.
Raja Balindra Singh Trophy: రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని కైవసం చేసుకున్న మహారాష్ట్ర
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. దాంతో శ్రీలంక జట్టు ఆటతీరుపై ఆ దేశ ప్రభుత్వ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. మాజీ కెపె్టన్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని నియమించారు.
అయితే ఈ నిర్ణయంపై బోర్డు కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు క్రికెట్ బోర్డును పునర్నియమించింది. జింబాబ్వే (2021) తర్వాత ఐసీసీ ద్వారా సస్పెన్షన్‌కు గురైన రెండో పూర్తిస్థాయి సభ్యత్వ దేశం శ్రీలంక కావడం గమనార్హం.