Skip to main content

Asian Archery Championships 2023: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం ప‌త‌కాలు

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది.
Surekha Shines with Two Medals in Asian Archery Championship, Vennam Jyoti Surekha, Indian Archery Star, Jyoti Surekha wins gold, silver medals in Asian Archery Championship,

గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్‌ ఆఫ్‌’లో భారత్‌కే చెందిన పర్ణీత్‌ కౌర్‌ చేతిలో ఓడిపోయింది.  జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత బృందం కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో 234–233తో చైనీస్‌ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది.

Asian Archery Championships 2023: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు

మరోవైపు  కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో అదితి–ప్రియాంశ్‌ జోడీ 156–151తో కనోక్‌నాపుస్‌–నవాయుత్‌ (థాయ్‌లాండ్‌) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్‌ వర్మ 147–146తో జూ జేహూన్‌ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. 

National Games 2023: జాతీయ క్రీడల్లో చికితకు పసిడి ప‌త‌కం

Published date : 10 Nov 2023 03:19PM

Photo Stories