Skip to main content

Farhaan Behardien: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌

South Africa all rounder Farhaan Behardien retires from cricket

ఈ ఏడాది మరో ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా జట్టు వన్డే స్పెషలిస్ట్‌ ఫర్హాన్‌ బెహర్‌డియెన్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు.‘18 ఏళ్ల జర్నీ అన్ని ఫార్మాట్లలో 560 మ్యాచ్‌లు. వీటిలో జాతీయ జట్టు తరఫున 97 మ్యాచ్‌లు’ అని ట్విట్టర్‌ వేదికగా ఫర్హాన్‌ తెలిపాడు. 2018 నవంబర్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఇతను చివరి మ్యాచ్‌ ఆడాడు. 2012 ఫర్హాన్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించాడు. మూడు టీ20 వరల్డ్‌ కప్‌లు (2012, 2014, 2016), 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడాడు. 59 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఫర్హాన్‌.. వన్డేల్లో 1,074 ర¯న్స్‌, పొట్టి క్రికెట్‌లో 518 ర¯న్స్‌ స్కోర్‌ చేశాడు. 2017లో దక్షిణాఫ్రికా టీ20 టీమ్‌కు కెప్టెన్‌ గా పనిచేశాడు. ఈ ఆల్‌రౌండర్‌తన కెరీర్‌లో ఒక్కటెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేదు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jan 2023 06:10PM

Photo Stories