Skip to main content

BWF Badminton Rankings: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10 నుంచి పీవీ సింధు అవుట్‌.. ప్ర‌స్తుతం సింధు ర్యాంక్ ఎంతంటే..

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 2016 నవంబర్‌ తర్వాత తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో చోటు కోల్పోయింది.
Sindhu drops out of world top 10

స్విస్‌ ఓపెన్‌లో సింధు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోవ‌డం ఈ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. మార్చి 28న‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ ఏడాది సింధు నాలుగు టోర్నీలలో పాల్గొని మూడింటిలో తొలి రౌండ్‌లో ఓడిపోయి, మరో టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్ర‌మించింది. 

Boxing World Championship: ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా భారత్..
భారత్‌కే చెందిన మరో స్టార్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా నెహ్వాల్‌ ఒక స్థానం ఎగబాకి 31వ ర్యాంక్‌లో నిలిచింది. జనవరిలో ఇండోనేసియా ఓపెన్‌ తర్వాత సైనా మరో టోర్నీలో ఆడలేదు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొమ్మిదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. కిదాంబి శ్రీకాంత్‌ 21వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్‌ 25వ ర్యాంక్‌లో నిలిచారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Published date : 29 Mar 2023 06:21PM

Photo Stories