Skip to main content

Max Verstappen : ఫార్ములావన్‌ విజేత వెర్‌స్టాపెన్‌

ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 2022 ఫార్ములావన్‌ సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్‌లో చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల ఈ రేసును వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 27 నిమిషాల 45.914 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో, పెరెజ్‌ (రెడ్‌బుల్‌) మూడో స్థానంలో నిలిచారు. ఓవరాల్‌ గా ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌ మొత్తం 15 రేసుల్లో విజేతగా నిలిచి 454 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌తో ముగించాడు. అంతేకాకుండా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్‌1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్‌ రికార్డు నెలకొల్పాడు. 

Published date : 21 Nov 2022 06:46PM

Photo Stories