LLC Commissioner: రిటైర్డ్ క్రికెట్ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన లీగ్ పేరు?
భారత హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి మరో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. రిటైర్డ్ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) కమిషనర్‌గా రవిశాస్త్రి వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా తెలిపారు. ఎల్‌ఎల్‌సీ తొలి సీజన్ 2022, జనవరిలో గల్ఫ్‌లో ఆరంభం కానుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తా¯Œ దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు పాల్గొంటారు.
బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఫార్ములావన్ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి–2021లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా అవతరించాడు. బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో నవంబర్ 15న జరిగిన ప్రధాన రేసులో 71 ల్యాప్‌ల దూరాన్ని హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 101వ విజయం. 10.496 సెకన్లు వెనుకగా రేసును పూర్తి చేసిన వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములావన్ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి–2021లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : సావోపాలో, బ్రెజిల్
ఎందుకు : ప్రధాన రేసులో 71 ల్యాప్‌ల దూరాన్ని హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసినందున..
చదవండి: ఎన్‌సీఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న క్రికెటర్?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్