Skip to main content

Wimbledon 2022 పురుషుల సింగిల్స్‌ విజేత జొకోవిచ్

Novak Djokovic defeats Nick Kyrgios to win 21st Grand Slam
Novak Djokovic defeats Nick Kyrgios to win 21st Grand Slam

పచ్చిక కోర్టులపై తనకు ఎదురులేదని నిరూపిస్తూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఏడోసారి చాంపియన్‌గా నిలిచాడు. జూలై 10న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో అన్‌సీడెడ్, ప్రపంచ 40వ ర్యాంకర్‌ నిక్‌ కిరియోస్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో వింబుల్డన్‌ టైటిల్‌ కావడం విశేషం. 2018, 2019, 2021లలోనూ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. అంతకుముందు 2011, 2014, 2015లలో కూడా ఈ సెర్బియా స్టార్‌ చాంపియన్‌ అయ్యాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్‌ టోర్నీని నిర్వహించలేదు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల బ్రిటిష్‌ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్‌ కిరియోస్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 35 ఏళ్ల జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను తొమ్మిదిసార్లు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్‌ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచాడు.  

Also read: Wimbledon 2022 Women's సింగిల్స్‌ విజేత రిబాకినా

Published date : 11 Jul 2022 07:50PM

Photo Stories