Skip to main content

Wimbledon 2022 Women's సింగిల్స్‌ విజేత రిబాకినా

Wimbledon 2022 Women's Singles Title
Wimbledon 2022 Women's Singles Title

వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను  కజకిస్తాన్‌ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా గెలుచుకుంది. లండన్ లో జూలై 9న  జరిగిన వింబుల్డన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 23 ఏళ్ల రిబాకినా చాంపియన్‌గా అవతరించింది. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ రిబాకినా 3–6, 6–2, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి కజకిస్తాన్‌ ప్లేయర్‌గా రిబాకినా చరిత్ర సృష్టించింది. విజేతగా నిలిచిన రిబాకినాకు 20 లక్షల బ్రిటిష్‌ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్‌ జబర్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

Also read: 10 Interesting Facts About MS Dhoni

Published date : 11 Jul 2022 07:33PM

Photo Stories