Nishka Agarwal: జాతీయ జిమ్నాస్టిక్స్ చాంప్ నిక్ష
Sakshi Education
![Nishka Agarwal wins Junior National Gymnastics Championship](/sites/default/files/images/2023/01/14/niksha-1673682759.jpg)
కేరళ వేదికగా జరిగిన 57వ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిక్ష అగర్వాల్ టైటిల్‌తో మెరిసింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆల్‌రౌండ్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. తద్వారా బుద్దా అరుణారెడ్డి (2011) తర్వాత 12ఏళ్లకు జాతీయ టైటిల్ దక్కించుకున్న తెలంగాణ ప్లేయర్‌గా నిక్ష నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ 14 ఏల్ల యువ జిమ్నాస్ట్ జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. ఇటీవల జరిగిన సీబీఎస్‌ఈ జాతీయ జిమ్నాస్టిక్స్‌లో మూడు స్వర్ణాలు సహా ఈజిప్టు టోర్నీలో పసిడి, ఖేలో ఇండియాలో రజతం, జాతీయ జూనియర్ టోర్నీలో వెండి పతకం ఖాతాలో వేసుకుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 14 Jan 2023 01:22PM