Skip to main content

Asian Wrestling Championships: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిషాకి రజతం, ప్రియాకి కాంస్యం

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏప్రిల్ 11న మొదలైన మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి.
Nisha

నిషా (68 కేజీలు) రజత పతకం.. ప్రియా (76 కేజీలు) కాంస్య పతకం సాధించారు. నీలమ్‌ (50 కేజీలు) కాంస్య పతక బౌట్‌లో ఓడిపోగా.. సీతో (55 కేజీలు), సరిత మోర్‌ (59 కేజీలు) నిరాశపరిచారు. 68 కేజీల విభాగంలో ఫైనల్లో నిషా 0–10తో గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అమీ ఇషి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. ప్రియా 2–1తో మిజుకి నాగషిమ (జపాన్‌)పై గెలుపొంది కాంస్య పతకాన్ని దక్కించుకుంది. నీలమ్‌ 0–10తో జికి ఫెంగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (05-11 మార్చి 2023)

Published date : 12 Apr 2023 03:37PM

Photo Stories