T20 World Cup: స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్-2021’ అవార్డు న్యూజిలాండ్ ఆటగాడు డరైల్ మిచెల్‌కు లభించింది. 2021 టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతను కనబర్చిన క్రీడాస్ఫూర్తికి ఐసీసీ గుర్తింపునిచ్చింది. నాటి మ్యాచ్‌లో రషీద్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని నీషమ్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. సునాయాసంగా పరుగు వచ్చే అవకాశం ఉన్నా... నాన్ స్ట్రైకర్ డరైల్ మిచెల్ దానిని తిరస్కరించాడు. తాను బౌలర్ కు అడ్డుగా రావడం వల్లే రషీద్ దానిని రిటర్న్ లో సరిగా అందుకోలేకపోయాడని... అందుకే సింగిల్‌కు అవకాశం ఏర్పడిందని మిచెల్ భావించాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పరుగు తీయడానికి నిరాకరించాడు.
తొలి భారత ఆటగాడు..
ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక ‘లారెస్’ అవార్డు కోసం పోటీ పడుతున్నాడు. 2021 ఏడాది అద్భుత ప్రదర్శనతో క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నీరజ్‌కు ‘వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో నామినేషన్ లభించింది. ఈ కేటగిరీలో తుది జాబితాకు నామినేట్ అయిన తొలి భారత ఆటగాడిగా నీరజ్ నిలిచాడు. టెన్నిస్ స్టార్లు డానిల్ మెద్వెదెవ్ (రష్యా), ఎమ్మా రాడుకాను (బ్రిటన్) తదితర మేటి క్రీడాకారులతో నీరజ్ తలపడుతున్నాడు.
చదవండి: సమ్మర్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపికైన క్రికెటర్?
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : న్యూజిలాండ్ ఆటగాడు డరైల్ మిచెల్
ఎందుకు : 2021 టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్.. అర్బుత క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్