Skip to main content

National Sub Junior, Junior Aquatic Championships 2023: చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించింది వ్రిత్తి అగర్వాల్‌

జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్లు ఆరు స్వర్ణాలు,ఐదు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు.
National Sub Junior, Junior Aquatic Championships 2023
National Sub Junior, Junior Aquatic Championships 2023

హైదరాబాద్‌ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్‌ గ్రూప్‌–1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ప్ టైటిల్‌ను సాధించింది. వ్రిత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. చివరిరోజు శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది.  నిత్యశ్రీ సాగి రెండు రజతాలు, ఒక కాంస్యం, సుహాస్‌ ప్రీతమ్‌ రెండు కాంస్యాలు నెగ్గారు .

National Sub Junior, Junior Aquatic Championships 2023: వ్రిత్తికి మ‌రో స్వర్ణం

Published date : 21 Aug 2023 06:28PM

Photo Stories