Skip to main content

Asian Cup Table Tennis 2022: చరిత్ర సృష్టించిన మనిక బత్రా

ఏషియన్‌ కప్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా అద్భుతం చేసింది. ఈ టోర్నీ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

బ్యాంకాక్‌లో న‌వంబ‌ర్ 19న‌ జరిగిన మహిళల సింగిల్స్‌ కాంస్య పతక మ్యాచ్‌లో 44వ ర్యాంకర్‌ మనిక 11–6, 6–11, 11–7, 12–10, 4–11, 11–2తోప్రపంచ 6వ ర్యాంకర్‌ హినా హయాటా (జపాన్‌)పై సంచలన విజయం సాధించింది. కాంస్యం గెలిచిన మనిక బత్రాకు 10 వేల డాలర్ల (రూ. 8 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. అంతకుముందు సెమీఫైనల్లో మనిక 8–11, 11–7, 7–11, 6–11, 11–8, 7–11తో మిమా ఇటో (జపాన్‌) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. ‘ఈ విజయం నాకెంతో గొప్పది. మేటి క్రీడాకారిణులను ఓడించినందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో జరిగే టోర్నీలలోనూ ఇదే జోరును కనబరుస్తా’ అని మనిక వ్యాఖ్యానించింది.

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ రద్దు.. నూత‌న‌ సెలక్టర్ల క‌మిటీ కోసం..

Published date : 21 Nov 2022 01:31PM

Photo Stories