Ironman Triathlon: ఫ్రాన్స్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఉజ్వల్ చౌధురి!
Sakshi Education
ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌లో డాక్‌యార్డు ఉద్యోగికి 5వ స్థానం
కజికిస్తాన్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్‌లో నేవీ అనుబంధ సంస్థ నేవల్ డాక్‌యార్డు ఉద్యోగి అత్యుత్తమ ప్రతిభని కనబరిచారు. జూలై 2న జరిగిన పోటీల్లో ట్రయథ్లాన్‌ని 11 గంటల 4 నిమిషాల్లో ముగించిన డాక్‌యార్డు లెఫ్టినెంట్ కమాండర్ ఉజ్వల్ చౌధురి ఐదో స్థానంలో నిలిచారు.
Daily Current Affairs in Telugu: 6 జులై 2023 కరెంట్ అఫైర్స్
ఈ రేసులో 3.8 కిమీ స్విమ్మింగ్, 180 కిమీ సైక్లింగ్, 42.2 కిమీ మారథాన్‌ని 11 గంటల్లో పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో 400 మంది పాల్గొనగా.. భారత్‌కు చెందిన 50 మంది పాల్గొన్నారు. ఇండియా తరఫున నంబర్‌వన్‌గానూ, వరల్డ్ టాప్–5లో చోటు సాధించి.. త్వరలో ఫ్రాన్స్‌లో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్‌కు ఉజ్వల్ చౌధురి అర్హత సాధించారు.
Published date : 06 Jul 2023 06:04PM