Daily Current Affairs in Telugu: 6 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
2. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
3. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపు వాదనలు వినిపించేందుకు నియమితులైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్‌జీ) ఎన్.హరినాథ్ పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
4. గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం కోసం డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
5. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా జూలై 4వ తేదీ 17.18 డిగ్రీల సెల్సియస్(62.92 డిగ్రీల ఫారన్‌హీట్)తో రికార్డుకెక్కిందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.
☛ Daily Current Affairs in Telugu: 5 జులై 2023 కరెంట్ అఫైర్స్
6. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో ఐస్‌లాండ్ 163 దేశాలకుగాను అత్యంత శాంతియుత దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం 126 స్థానంలో నిలిచింది.
7. ఆధవ్ అర్జున బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు.
8. మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, ఇన్నోవేటివ్ ఎయిర్ మొబిలిటీలో సహకారం కోసం భారతదేశ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA)తో అవగాహన ఒప్పందం (MOU)చేసుకుంది.
9. జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ 2023 (JIMEX 23) ఏడవ ఎడిషన్ జులై 05 నుంచి 10 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.
10. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.5,000 కోట్లతో రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించింది.
11. జులై 5 నుంచి 7 వరకు గ్రీన్ హైడ్రోజన్ (ICGH-2023)పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును కేంద్ర విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ R.K.సింగ్ న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు.
☛ Daily Current Affairs in Telugu: 4 జులై 2023 కరెంట్ అఫైర్స్