Skip to main content

India Vs Australia : టీ20 సీరీస్ భారత్ కైవసం

ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్ ల టీ20 సీరీస్ ను భారత్ 2 -1 తేడాతో గెలుచుకుంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాదో విజయం సాధించి సీరీస్ కైవసం చేసుకుంది
India's biggest wins in T20I
India's biggest wins in T20I

. 36 బంతుల్లో 69 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా ఎంపికయ్యాడు. సీరీస్ లో 8 వికెట్లు పడగొట్టిన అక్సర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌లతో కూడిన టి20 సిరీస్‌లను గెలవడం భారత్‌కిది (2016, 2020, 2022) మూడోసారి. ఈ ఏడాది భారత్‌ మొత్తం 29 టి20 మ్యాచ్‌లు ఆడి 21 విజయాలు నమోదు చేసింది. ఒకే ఏడాది అత్యధిక టి20 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. 20 విజయాలతో పాకిస్తాన్‌ (2021లో) పేరిట ఉన్న రికార్డును భారత్‌ తిరగరాసింది.  ఒకే ఏడాది అత్యధిక టి20 మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా ధోని (2016లో) పేరిట ఉన్న రికార్డును 15వ గెలుపుతో రోహిత్‌ శర్మ సమం చేశాడు.  

Published date : 26 Sep 2022 08:30PM

Photo Stories