Thomas Cup 2022: థామస్ కప్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణం
Sakshi Education
బ్యాడ్మింటన్ లో భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన థామస్ కప్ ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3–0 తేడాతో ఓడించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. థామస్ కప్ గెలుచుకున్న ఆరవ దేశంగా భారత్ నిలిచింది.
Thomas Cup 2022 Winner: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
Published date : 24 May 2022 06:57PM