T20 World Cup for the Blind: భారత్ ‘హ్యాట్రిక్’.. మూడోసారి అంధుల టి20 ప్రపంచకప్ టైటిల్ సొంతం
Sakshi Education
చిన్నస్వామి స్టేడియంలో డిసెంబర్ 17న జరిగిన అంధుల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని భారత జట్టు 120 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్ మూడుసార్లు (2012, 2017, 2022) జరగ్గా మూడుసార్లూ భారతే గెలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 277 పరుగులు చేసింది. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లకు 157 పరుగులే చేసి ఓడిపోయింది. విజేత టీమిండియాకు రూ.3 లక్షలు, రన్నరప్ బంగ్లాదేశ్‌కు రూ. లక్షా 50 వేలు నగదు పురస్కారం లభించింది.
ICC ODI Rankings: డబుల్ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్ కిషన్..!
Published date : 19 Dec 2022 06:11PM