Skip to main content

ICC ODI Rankings: డబుల్‌ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్‌ కిషన్‌..!

వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచిన యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌ ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు.

ఒక్క ఇన్నింగ్స్‌తో ఏకంగా 117 స్థానాలు ఎగబాకిన కిషన్‌ 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌పైనే సెంచరీ చేసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 15వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ 22వ స్థానంలో నిలిచాడు.
ఐసీసీ టాప్‌-10 వన్డే ర్యాంక్స్‌లో ఉన్నది వీరే..
1.బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)-890 రేటింగ్‌
2.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్‌)- 779 రేటింగ్‌
3.రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)-766 రేటింగ్‌
4.క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాప్రికా)-759 రేటింగ్‌
5.డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)-747 రేటింగ్‌
6.స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)- 719 రేటింగ్‌
7.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్‌)- 710 రేటింగ్‌
8.విరాట్‌ కోహ్లి(భారత్‌)-707 రేటింగ్‌
9.రోహిత్‌ శర్మ(భారత్‌)-705 రేటింగ్‌
10.కేన్‌ విలియమ్సన్‌-700 రేటింగ్‌

Indian Olympic Association: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష

 

Published date : 15 Dec 2022 06:00PM

Photo Stories