FIDE Chess Championship: మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి రజతం
ఫిడె ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజత పతకం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే. గోర్యాక్ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టుతో స్పెయిన్‌లోని సిట్‌గెస్ పట్టణంలో అక్టోబర్ 2న జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీ ఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. ఫలితంగా రజత పతకం దక్కింది.
చదవండి: ఒస్ట్రావా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జోడి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిడె ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి రజతం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీ ఆన్‌గోమ్స్
ఎక్కడ : సిట్‌గెస్, స్పెయిన్
ఎందుకు : ఫైనల్లో భారత జట్టు రష్యా జట్టు చేతిలో ఓడిపోయినందున...
ఇప్పుడే చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
డౌన్‌లోడ్ వయా ఆపిల్ ఐ స్టోర్