Skip to main content

ISSF Junior World Cup: ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో తెలంగాణ షూటర్‌ మేఘన బృందానికి స్వర్ణం

జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ సాదుల మేఘన స్వర్ణ పతకంతో మెరిసింది.

జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో మేఘన (577 పాయింట్లు), పాయల్‌ ఖత్రీ (572), సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ బ్రార్‌ (570)లతో కూడిన భారత జట్టు 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా మేఘన జట్టు 1719 పాయింట్లు స్కోరు చేసింది. వ్యక్తిగత విభాగంలో మేఘన నాలుగో స్థానంలో నిలిచింది.    

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (07-13 మే 2023)

Published date : 08 Jun 2023 01:07PM

Photo Stories