Skip to main content

ICC Chairman Greg Barclay : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా గ్రెగ్ ఎన్నిక‌..! సౌరవ్‌ గంగూలీకి మాత్రం..

ఐసీసీ నూత‌న‌ ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్లే (న్యూజిలాండ్‌) నియమితులయ్యారు. న‌వంబ‌ర్ 12 వ తేదీన జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సమావేశంలో గ్రెగ్‌ను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ICC New Chairman Greg Barclay
Greg Barclay

న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్క్లే 2020 నవంబరులో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది నవంబరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా.. ఛైర్మన్‌ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేసినప్పటికీ.. చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ సహా 17 మంది ఐసీసీఐ బోర్డు సభ్యులు గ్రెగ్‌కు మద్దతివ్వగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు గ్రెగ్‌. 

ICC T20 Rankings 2022: అగ్రస్థానంలో సూర్యకుమార్‌ యాదవ్ .. కోహ్లి ర్యాంక్ మాత్రం ఇంతే..

sourav ganguly

తొలుత బీసీసీఐ.. మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని బరిలోకి దింపాలని భావించినప్పటికీ, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 17 మంది సభ్యులున్న ఐసీసీ బోర్డులో బీసీసీఐ సహా 12 మందికి పైగా సభ్యులు బార్క్లేకు మద్దతు ప్రకటించారు.

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

Published date : 12 Nov 2022 01:19PM

Photo Stories