Skip to main content

Commonwealth Games: ప్రస్తుతం కేంద్ర క్రీడల మంత్రిగా ఎవరు ఉన్నారు?

Anurag Thakur

2021 ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని అక్టోబర్‌ 10న కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని లేదంటే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని... జట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, క్రీడా సమాఖ్యలకు కాదని ఠాకూర్‌ అన్నారు.

టర్కీ గ్రాండ్‌ప్రి విజేత?

ఫార్ములావన్‌ రేసు టర్కీ గ్రాండ్‌ప్రి విజేతగా మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ నిలిచాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో అక్టోబర్‌ 10న జరిగిన ఈ రేసులో 58 ల్యాప్‌ల దూరాన్ని బొటాస్‌ అందరి కంటే ముందుగా గంటా 31 నిమిషాల 04.103 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. బొటాస్‌ కెరీర్‌లో ఇది పదో విజయం. రెడ్‌బుల్‌ డ్రైవర్లు మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్, పెరెజ్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు యూఎస్‌ గ్రాండ్‌ప్రి అక్టోబర్‌ 24న జరుగుతుంది.
 

చ‌ద‌వండి: కామన్వెల్త్‌ గేమ్స్‌–2022ను ఎక్కడ నిర్వహించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021 ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదు
ఎప్పుడు : అక్టోబర్‌ 10
ఎవరు     : కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
ఎందుకు : నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 11 Oct 2021 04:32PM

Photo Stories