Skip to main content

Menorca Open: మెనోర్కా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ చాంపియన్‌గా గుకేశ్‌

భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ మెనోర్కా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో వరుసగా రెండో ఏడాది టైటిల్‌ సాధించాడు.
Gukesh

స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత గుకేశ్‌తోపాటు మరో తొమ్మిదిమంది ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. గుకేశ్, ప్రణవ్‌లకు తొలి రెండు ర్యాంక్‌లు లభించాయి. విజేతను నిర్ణయించేందుకు గుకేశ్, ప్రణవ్‌ మధ్య రెండు బ్లిట్జ్‌ టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్‌ 1.5–0.5తో ప్రణవ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.
గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ.2 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిది రౌండ్లలో గుకేశ్‌ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న తెలంగాణ ప్లేయర్లు హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో 11వ ర్యాంక్‌లో, వుప్పాల ప్రణీత్‌ 6 పాయింట్లతో 19వ ర్యాంక్‌లో, రాజా రిత్విక్‌ 5.5 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు.

Ranji Trophy: రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు

Published date : 18 Apr 2023 06:17PM

Photo Stories