Dav Whatmore: విజయ్ మర్చంట్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది?
వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం బరోడా జట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, విఖ్యాత కోచ్ డేవ్ వాట్‌మోర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ సంఘం సెప్టెంబర్ 24న ధ్రువీకరించారు. 67 ఏళ్ల వాట్‌మోర్ 1996 వన్డే ప్రపంచకప్ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాల్ జాతీయ జట్లకు... భారత్‌లో కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.
కొన్ని క్రికెట్ టోర్నమెంట్‌ల పేర్లు...
రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవ్‌ధర్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఎన్‌కేపీ సాల్వే ట్రోఫీ, కల్నల్ సి.కె.నాయుడు ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ లీగ్ టీ20, చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, యాషెస్, కూచ్ బిహార్ ట్రోఫీ, మెయినుద్దౌలా కప్, విజయ్ మర్చంట్ ట్రోఫీ, విజ్జీ ట్రోఫీ, శీష్ మహల్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.
చదవండి: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బరోడా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, విఖ్యాత కోచ్ డేవ్ వాట్‌మోర్
ఎందుకు : వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం...