Skip to main content

Men's Hockey: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం?

Hockey

భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్‌ గా ఉన్న ఒడిశా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. 2021, నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరిగే పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనుంది.  ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిశాకు కట్టబెడుతూ సెప్టెంబర్‌ 23న అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌ కోసం ఉత్తరప్రదేశ్‌ కూడా రేసులో ఉన్నా... 2016 ప్రపంచకప్‌ అక్కడే జరగడంతో ఈసారి ఒడిశాకు అవకాశం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌తో పాటు మరో 15 దేశాలు పాల్గొంటున్నాయి.

చ‌ద‌వండి: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ను ఇకపై ఏ పేరుతో వ్యవహరించనున్నారు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌–2021కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం? 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : ఒడిశా 
ఎక్కడ    : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం మేరకు...

Published date : 24 Sep 2021 03:28PM

Photo Stories