Asian Gymnastics: ఏషియన్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి
Sakshi Education
![Historic moment First Gold to India in Asian Gymnastics by Star gymnast Deepa Karmakar](/sites/default/files/images/2024/06/07/asian-gymnastics-first-gold-1717741845.jpg)
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కొత్త చరిత్ర లిఖించింది. డోపింగ్ ఆరోపణలతో 21 నెలల పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్న దీప.. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఏషియన్ సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్లో దీప పసిడి పతకంతో మెరిసింది. ఈ టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ సీనియర్ జిమ్నాస్ట్ 13.566 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కిమ్సాన్ హ్యాంగ్(13.466), జో క్యాంగ్ బోల్(12.966) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు వీరే..
Published date : 07 Jun 2024 12:00PM