FIDE: గ్రాండ్ స్విస్ టూర్ చెస్ టోర్ని ఎక్కడ జరగనుంది?
లాత్వియా రాజధాని నగరం రిగాలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో 2021, అక్టోబర్ 27వ తేదీ నుంచి గ్రాండ్ స్విస్ టూర్ చెస్ టోర్నమెంట్-2021 జరగనుంది. ఓపెన్ విభాగం, మహిళల విభాగంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ చెస్‌లోని అగ్రశ్రేణి క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నారు.
నిహాల్ సరీన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?
గ్రాండ్ స్విస్ టూర్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత్ నుంచి పది మంది గ్రాండ్‌మాస్టర్లు బరిలోకి దిగనున్నారు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, నిహాల్ సరీన్, డి.గుకేశ్, కృష్ణన్ శశికిరణ్, ఎరిగైసి అర్జున్, సేతురామన్, ప్రజ్ఞానంద, సూర్యశేఖర గంగూలీ, రౌనక్ సాధ్వాని బరిలో ఉన్నారు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, వంతిక అగర్వాల్, దివ్యా దేశ్‌ముఖ్ ఆడుతున్నారు.
చదవండి: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, అక్టోబర్ 27వ తేదీ నుంచి గ్రాండ్ స్విస్ టూర్ చెస్ టోర్నమెంట్-2021 ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)
ఎక్కడ : రిగా, లాత్వియా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్