Men's FIH Hockey: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం?
పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021కు ఆసియా దేశం భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా 2021, నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు అక్టోబర్ 26న హాకీ ఇండియా (హెచ్‌ఐ) వెల్లడించింది. టోర్నీలో భారత్‌తో సహా మరో 15 జట్లు (అర్జెంటీనా, బెల్జియం, కెనడా, చిలీ, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మలేసియా, పాకిస్తాన్, పోలాండ్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, నెదర్లాండ్స్, అమెరికా) పాల్గొననున్నాయి. కరోనా వల్ల టోర్నీకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు దూరంగా ఉన్నాయి.
చదవండి: యూఎస్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్–2021కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : భారత్
ఎక్కడ : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా రాష్ట్రం
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్