Skip to main content

ఏప్రిల్ 2021 స్పోర్ట్స్

ఉజ్బెకిస్తాన్‌ స్విమ్మింగ్‌ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారతీయుడు?
Current Affairs
ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్ని మూడో రోజు ఏప్రిల్‌ 15న భారత్‌కు ఎనిమిది పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉంది. ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరం తాష్కెంట్‌లో ఈ టోర్ని జరుగుతోంది.
పతకాల విజేతలు–వివరాలు
  • పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 20 ఏళ్ల తమిళనాడు స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ స్వర్ణం గెలిచాడు. అతను 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు.
  • మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మానా పటేల్‌ (1ని:04.47 సెకన్లు) బంగారు పతకాన్ని గెల్చుకుంది. సువన భాస్కర్‌ ఖాతాలో రజతం చేరింది.
  • పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్‌ ప్రకాశ్‌ (3ని:56.03 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఈ టోర్నీలోని సజన్‌కిది మూడో స్వర్ణం.
  • మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని కటారియా స్వర్ణం పొందింది.
  • మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చాహత్‌ అరోరా బంగారు పతకాన్ని ౖకైవసం చేసుకుంది.
  • పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో లిఖిత్, ధనుశ్‌ వరుసగా రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న మహిళా రెజ్లర్‌?

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు మెరిశారు. కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఏప్రిల్‌ 15న జరిగిన పోటీల్లో భారత రెజ్లర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలను సాధించారు. 59 కేజీల విభాగంలో సరితా మోర్‌ పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో సరితా 10–7 పాయింట్లతో షూవ్‌డోర్‌ బాతర్జావ్‌ (మంగోలియా)ను ఓడించి విజేతగా నిలిచింది.
మరోవైపు 50 కేజీల విభాగంలో సీమా బిస్లా... 76 కేజీల విభాగంలో పూజా కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. కాంస్య పతక బౌట్‌లలో సీమా బిస్లా 10–0తో యుంగ్‌ సున్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ)పై... పూజా 5–2తో సియోన్‌ జియోంగ్‌ (కొరియా)పై విజయం సాధించారు.
కజకిస్తాన్‌...
రాజధాని: నూర్‌–సుల్తాన్‌; కరెన్సీ: టెంజె
కజకిస్తాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు: కాస్సిమ్‌–జోమార్ట్‌ తోకాయేవ్‌
కజకిస్తాన్‌ ప్రస్తుత ప్రధాని: అస్కర్‌ మామిన్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న మహిళా రెజ్లర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు : సరితా మోర్‌
ఎక్కడ : అల్మాటీ, కజకిస్తాన్‌

ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌ టోర్నిలో స్వర్ణం గెలిచిన మహిళా స్విమ్మర్‌?
ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా స్విమ్మర్‌ కెనిషా గుప్తా మూడో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరం తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఏప్రిల్‌ 16న జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన కెనిషా 26.61 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. 17 ఏళ్ల కెనిషా ఇదే టోర్నీలో 100, 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్స్‌లోనూ పసిడి పతకాలు గెలిచింది.
భారత్‌కు నీరవ్‌ మోదీ అప్పగింతకు అంగీకారం
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని యూకేలోని భారత రాయబార వర్గాలు ఏప్రిల్‌ 16న వెల్లడించాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్‌ కేసులు నీరవ్‌ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌ టోర్ని 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మహిళా స్విమ్మర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : కెనిషా గుప్తా
ఎక్కడ : తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌

భారత క్రీడాకారిణి దివ్య కక్రాన్‌ ఏ క్రీడలో ప్రావీణ్యురాలు?
ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఏప్రిల్‌ 16న జరిగిన ఐదు వెయిట్‌ కేటగిరీల్లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), దివ్య కక్రాన్‌ (72 కేజీలు) పసిడి పతకాలు దక్కించుకోగా... సాక్షి మలిక్‌ (65 కేజీలు) రజతం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వినేశ్, అన్షు తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచారు.
గతంలో ఎనిమిదిసార్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్న వినేశ్‌ నాలుగుసార్లు కాంస్యం (2020, 2019, 2016, 2013), మూడుసార్లు రజతం (2018, 2017, 2015) కైవసం చేసుకోగా... ఒకసారి (2104) ఐదో స్థానంలో నిలిచింది.

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం 22వ కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. షేడ్యూల్‌ ప్రకారం 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్‌ గేమ్స్‌–2022 జరగనున్నాయి. పోటీలు ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టి20 క్రికెట్‌ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది.
22వ కామన్వెల్త్‌ గేమ్స్‌ నినాదం(Motto): గేమ్స్‌ ఫర్‌ ఎవ్రివన్‌(Games for Everyone)
బరిలో భారత మహిళల క్రికెట్‌ జట్టు...
2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పాల్గొంటుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్‌ 16న ప్రకటించింది. 1998 కౌలాలంపూర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్‌ టోర్నీని నిర్వహించారు. ఆ తర్వాత ఈ క్రీడల నుంచి క్రికెట్‌ను తొలగించారు. 2022 బర్మింగ్‌హమ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో కేవలం మహిళల క్రికెట్‌ ఈవెంట్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత మహిళా లిఫ్టర్‌?
ఆసియా సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్‌ సైఖోమ్‌ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది. ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఏప్రిల్‌ 17న మీరాబాయి... క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో స్వర్ణం, ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ ఈవెంట్‌లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్‌ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది.
స్నాచ్‌లో... మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
జిల్లీ దలబెహెరాకు మూడు స్వర్ణాలు...
ఆసియా సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏప్రిల్‌ 18న జరిగిన మహిళల 45 కేజీల విభాగం ఈవెంట్‌లో భారత లిఫ్టర్‌ జిల్లీ దలబెహెరా... స్నాచ్‌లో, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో, ఓవరాల్‌గా అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలు సాధించింది. ఒడిశాకు చెందిన జిల్లీ మొత్తం 157 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 88) బరువెత్తింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత మహిళా లిఫ్టర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు : భారత మహిళా లిఫ్టర్‌ సైఖోమ్‌ మీరాబాయి చాను
ఎక్కడ : ఆసియా సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌(తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌)
ఎందుకు : క్లీన్‌ అండ్‌ జెర్క్‌ ఈవెంట్‌లో మీరాబాయి 119 కేజీల బరువెత్తినందున

భారత్‌కి చెందిన రవి కుమార్‌ దహియా ఏ క్రీడకు చెందినవాడు?
కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2021 పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. ఏప్రిల్‌ 17న బరిలోకి దిగిన ఐదు వెయిట్‌ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్‌ దహియా (57 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా.. బజరంగ్‌ పూనియా (65) రజత పతకం సాధించాడు. కరణ్‌ (70 కేజీలు), నర్సింగ్‌ యాదవ్‌ (79 కేజీలు), సత్యవర్త్‌ కడియాన్‌ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌–2021కు అర్హత సాధించిన రవి కుమార్‌(ఢిల్లీ)... అలీరెజా (ఇరాన్‌)తో జరిగిన ఫైనల్లో 9–4 పాయింట్లతో గెలిచాడు. 2020, న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. మరోవైపు ఏప్రిల్‌ 18న జరిగిన పోటీల్లో దీపక్‌ పూనియా (86 కేజీలు) రజతం, సంజీత్‌ (92 కేజీలు) కాంస్యం గెలిచారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2021 పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు
ఎప్పుడు : ఏప్రిల్‌ 17
ఎవరు : రవి కుమార్‌ దహియా (57 కేజీలు)
ఎక్కడ : అల్మాటీ, కజకిస్తాన్‌

ఎమిలియా రొమానో ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రి విజేత ఎవరు?
ఎమిలియా రొమానో ఫార్ములావన్‌ (ఎఫ్‌1) గ్రాండ్‌ప్రి విజేతగా రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నిలిచాడు. ఇటలీలోని ఇమోలాలో ఏప్రిల్‌ 18న జరిగిన 63 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌... 2 గంటలా 2 నిమిషాల 34.598 సెకన్లలో అందరికంటే ముందుగా ముగించి విజేతగా అవతరించాడు. తాజా సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది తొలి విజయంకాగా... ఓవరాల్‌గా 11వది. 22 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండు... 23.702 సెకన్లు వెనుకగా ముగించిన నోరిస్‌ (మెక్‌లారెన్‌) మూడు స్థానాల్లో నిలిచారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఎమిలియా రొమానో ఫార్ములావన్‌ (ఎఫ్‌1) గ్రాండ్‌ప్రి విజేత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 18
ఎవరు : రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌
ఎక్కడ : ఇమోలా, ఇటలీ

స్టార్‌ నెట్‌వర్క్‌కే ప్రొ కబడ్డీ లీగ్‌ హక్కులు
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) హక్కుల్ని స్టార్‌ నెట్‌వర్కే తిరిగి కైవసం చేసుకుంది. ఏడాదికి రూ. 180 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు పొందింది. 2019 ఏడాది రూ. 90 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం. కరోనా కారణంగా 2020లో పీకేఎల్‌ జరగలేదు. గత ఏడేళ్లుగా స్టార్‌ టీవీ చానెళ్లలోనే ఈ కబడ్డీ పోటీలు ప్రసారం అవుతున్నాయి.

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాయిదా
టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలలో ఒకటైన ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రకటించింది. కరోనా ఉధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 19న తెలిపింది. ఈ టోర్నీ న్యూఢిల్లీ వేదికగా 2021, మే 11 నుంచి 16 వరకు జరగాల్సింది. కరోనా కారణంగానే 2020 ఏడాది కూడా ఇండియా ఓపెన్‌ నిర్వహణ సాధ్యంకాలేదు.
బోరిస్‌ భారత పర్యటన రద్దు..
బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన భారత భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 19న వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్‌కు రావాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా, అప్పుడు బ్రిటన్‌లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు : భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో కరోనా ఉధృతి పెరగడంతో..

ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక క్రికెటర్‌?
అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్‌ దిల్హారా లోకుహెట్టిగేపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 19న వెల్లడించింది. 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీలో శ్రీలంకకు చెందిన ఓ జట్టు పాల్గొంది. ఈ టోర్నీ సందర్భంగా దిల్హారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఐసీసీ విచారణలో తేలింది. 40 ఏళ్ల దిల్హారా 2016లో రిటైరయ్యాడు. శ్రీలంక తరఫున తొమ్మిది వన్డేల్లో, రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స, ప్రధానమంత్రిగా మహింద రాజపక్స ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక క్రికెటర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు : దిల్హారా లోకుహెట్టిగే
ఎందుకు : 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీ సందర్భంగా.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినందకు

నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఎంపికైన వారు?
నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అవార్డు సెలక్షన్‌ కమిటీ ఏప్రిల్‌ 20న వెల్లడించారు. నేషనల్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ప్రతి ఏటా ఢిల్లీలో నవంబర్‌లో జరిగే జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ న్యాయశాస్త్ర నైపుణ్యాన్ని స్వశక్తితో మరింత అభివృద్ధి చేసుకుని ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సమర్థవంతంగా రాణిస్తున్నారని అవార్డు సెలక్షన్‌ కమిటీ ప్రశసించింది. నగర పోలీసు కమిషనర్‌గా అంజనీకుమార్‌ శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో ప్రజలకు భరోసా కల్పించడంలో సఫలీకృతమయ్యారని కమిటీ కొనియాడింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : నెల్సన్‌ మండేలా అవార్డు–2021కు ఎంపికైన వారు?
ఎప్పుడు: ఏప్రిల్‌ 20
ఎవరు : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌
ఎందుకు : విధుల నిర్వహణలో విశేష ప్రతిభకనబరిచినందుకు

ఐదేళ్ల నిషేధానికి గురైన అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెటర్‌?
అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) క్రికెటర్‌ ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఐదేళ్ల నిషేధం విధించింది. 2019 ఏప్రిల్‌లో జింబాబ్వేతో... 2019 ఆగస్టులో నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌ల సందర్భంగా ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశాడని రుజువు కావడంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. ఇదే కారణంతో హీత్‌ స్ట్రీక్‌ (జింబాబ్వే), దిల్హారా (శ్రీలంక)లపై కూడా ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌...
రాజధాని: అబుదాబి; కరెన్సీ: యూఏఈ దీర్హం
యూఏఈ ప్రస్తుత అధ్యక్షుడు: ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌
యూఏఈ ప్రస్తుత ప్రధాని, ఉపాధ్యక్షుడు: మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐదేళ్ల నిషేధానికి గురైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్రికెటర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌
ఎందుకు : ఐసీసీ నిర్వహించిన మ్యాచ్‌ల గురించి.. ఖాదీర్‌ అహ్మద్‌ఖాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి అంతర్గత సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేశాడని రుజువు కావడంతో

భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కిన ఆటగాడు?
భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌(జీఎం)గా తమిళనాడుకి చెందిన యువ చెస్‌ ఆటగాడు అర్జున్‌ కల్యాణ్‌ రికార్డులకు ఎక్కాడు. జీఎంగా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అర్జున్‌ ఏప్రిల్‌ 21న అధిగమించాడు. దీంతో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన 68వ భారతీయుడిగా అర్జున్‌ గుర్తింపు పొందాడు. సెర్బియాలో జరుగుతున్న రుజ్నా జోరా–3 జీఎం రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ అయిదో రౌండ్లో డ్రాగన్‌ కోసిక్‌పై పైచేయి సాధించడంతో అర్జున్‌కు విలువైన రేటింగ్‌ పాయింట్లు లభించాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత 68వ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 21
ఎవరు : అర్జున్‌ కల్యాణ్‌
ఎందుకు : జీఎంగా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను సాధించినందున...

ఎస్‌ హాకీ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితులైన భారతీయుడు?
Current Affairs
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కోచ్‌ హరీంద్ర సింగ్‌ ఇకపై యూఎస్‌ పురుషుల హాకీ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా పనిచేయనున్నారు. ఈ మేరకు అతడిని నియమిస్తూ యూఎస్‌ జాతీయ పురుషుల టీమ్‌ (యూఎస్‌ఎమ్‌ఎన్‌టీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయం ఏప్రిల్‌ 8న వెల్లడైంది. హరీంద్ర సింగ్‌ పర్యవేక్షణలోని భారత పురుషుల జట్టు 2018 ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
కొన్ని వివరాలు...
రంగస్వామి కప్‌: ఇది జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌. రంగస్వామి కప్‌ను కర్ణాటక మే, 2013లో తొలిసారి గెలుచుకుంది. బెంగళూర్‌లో జరిగిన ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది.
సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌: 1983లో ప్రారంభమైంది. ప్రతి ఏటా మలేసియాలో నిర్వహిస్తారు.
ఇతర ప్రముఖ హాకీ ట్రోఫీలు: ఆగాఖాన్‌ కప్, బైటన్‌ కప్, ఇందిరా గోల్డ్‌ కప్, మోడీ గోల్డ్‌ కప్, రంజిత్‌సింగ్‌ గోల్డ్‌ కప్, బాంబే గోల్డ్‌ కప్, ధ్యాన్‌చంద్‌ ట్రోఫీ, లేడీ రతన్‌ టాటా ట్రోఫీ, గురునానక్, మురుగప్ప గోల్డ్, ఒబైదుల్లా, ప్రపంచ కప్, ఆసియా కప్, చాంపియన్స్‌ ట్రోఫీ.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌ హాకీ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితులైన భారతీయుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 8
ఎవరు : ద్రోణాచార్య అవార్డు గ్రహీత, భారత హాకీ జట్టు మాజీ కోచ్‌ హరీంద్ర సింగ్‌

ఏసీటీ హాకీ టోర్నమెంట్‌ను ఏ దేశ రాజధానిలో నిర్వహించనున్నారు?
కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నమెంట్‌ను 2021 ఏడాది నిర్వహించేందుకు ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్‌) సిద్ధమైంది. ఈ మేరకు పురుషుల విభాగంలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను ఏప్రిల్‌ 9న ఏహెచ్‌ఎఫ్‌ ప్రకటించింది. బంగ్లాదేశ్‌ రాజధాని నగరం ఢాకా వేదికగా అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఏహెచ్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయం మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఉంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2021, అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నమెంట్‌ నిర్వహణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్‌)
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్‌

ఐపీఎల్‌ పద్నాలుగో సీజన్‌ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) çపద్నాలుగో సీజన్‌ 2021, ఏప్రిల్‌ 9న చెన్నై చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్‌(ఎమ్‌ఐ), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగనుండగా, లీగ్‌ దశలో 56 మ్యాచ్‌లు... అనంతరం మూడు ప్లే ఆఫ్‌లు, ఫైనల్‌ కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మే 30న అహ్మదాబాద్‌లో తుది పోరు జరుగనుంది.
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌): ఇది ట్వంటీ20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌. భారతదేశంలో ప్రతి ఏటా ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. బీసీసీఐ నిర్వహిస్తోన్న ఐపీఎల్‌ 2008 ఏడాదిలో ప్రారంభమైంది. ఐపీఎల్‌–2021 సీజన్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా వివో సంస్థ వ్యవహరిస్తోంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) çపద్నాలుగో సీజన్‌ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : బీసీసీఐ
ఎక్కడ : చిదంబరం స్టేడియం, చెన్నై

కరోనా వైరస్‌తో కన్నుమూసిన ఒలింపిక్‌ చాంపియన్‌?
2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, నాలుగుసార్లు వరల్డ్‌ చాంపియన్, ఆరుసార్లు యూరోపియన్‌ చాంపియన్‌ అయిన హంగేరి మహిళా షూటర్‌ డయానా ఇగాలే(56)ను కరోనా మహమ్మారి కబళించింది. కరోనా వైరస్‌ లక్షణాలతో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె ఏప్రిల్‌ 9న తుదిశ్వాస విడిచారు.
తొలి హంగేరి ప్లేయర్‌గా...
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్కీట్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం నెగ్గిన డయానా... 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా షూటింగ్‌ క్రీడాంశంలో స్వర్ణం నెగ్గిన తొలి హంగేరి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆమె అంతర్జాతీయస్థాయిలో 32 పతకాలు గెల్చుకుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : కరోనా వైరస్‌తో కన్నుమూసిన ఒలింపిక్‌ చాంపియన్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : హంగేరి మహిళా షూటర్‌ డయానా ఇగాలే(56)
ఎక్కడ : బుడాపెస్ట్, హంగేరి
ఎందుకు : కరోనా వైరస్‌ కారణంగా...

మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్ని–2022 ఏ దేశంలో జరగనుంది?
2022 ఏడాది భారత్‌లో జరగాల్సిన అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్, ఆసియా కప్‌ టోర్నమెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రోమా ఖన్నా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 10న ఆమె తెలిపారు. అండర్‌–17 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కుల కోసం 2019లో భారత్‌ బిడ్‌ దాఖలు చేయడంలో, ఆతిథ్య హక్కులు లభించడంలో రోమా ఖన్నా కీలకపాత్ర పోషించారు. గత పదేళ్లుగా ఆమె అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)తో కలిసి పని చేస్తున్నారు.
పోల్గార్‌ చెస్‌ చాలెంజ్‌ టోర్నీ విజేత ప్రజ్ఞానంద
పోల్గార్‌ చాలెంజ్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చాంపియన్‌గా నిలిచాడు. 20 మంది క్రీడాకారుల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద మొత్తం 15.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌–2022 డైరెక్టర్‌ రాజీనామా
ఎప్పుడు : ఏప్రిల్‌ 10
ఎవరు : రోమా ఖన్నా
ఎందుకు : వ్యక్తిగత కారణాలతో

2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెజ్లర్లు?
ఇప్పటివరకు 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత రెజ్లర్ల సంఖ్య ఆరుకి చేరింది. వీరిలో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు), బజరంగ్‌ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు) ఉన్నారు. ఈ క్రమంలో భారత్‌ నుంచి మహిళల రెజ్లింగ్‌లో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన పిన్న వయస్కురాలిగా 18 ఏళ్ల సోనమ్‌ ఘనత సాధించింది.
‘మాస్టర్స్‌’ టోర్నీలో ఆసియా ప్లేయర్‌కు తొలిసారి టైటిల్‌
ప్రపంచ గోల్ఫ్‌ క్రీడలో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ‘మాస్టర్స్‌’ ఈవెంట్‌లో తొలిసారి ఆసియా ప్లేయర్‌ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఈ టోర్నీలో జపాన్‌ గోల్ఫర్, 29 ఏళ్ల హిడెకి మత్సుయామ టైటిల్‌ సాధించాడు. నిర్ణీత నాలుగు రౌండ్‌ల తర్వాత మత్సుయామ 278 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మత్సుయామకి 20,70,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.15 కోట్ల 54 లక్షలు)తోపాటు గ్రీన్‌ జాకెట్‌ను అందజేశారు.

భారత క్రీడాకారుడు సజన్‌ ప్రకాశ్‌ ఏ క్రీడకు చెందినవాడు?
ఉజ్బెకిస్తాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్లు పతకాల పంట పండించారు. టోర్నీ రెండో రోజు ఏప్రిల్‌ 14న భారత్‌కు ఏకంగా పది పతకాలు లభించాయి. ఉజ్బెకిస్తాన్‌ రాజధాని నగరం తాష్కెంట్‌లో ఈ టోర్ని జరుగుతోంది.
పతకాల విజేతలు...
  • పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సజన్‌ ప్రకాశ్‌ 1ని:50.74 సెకన్ల సమయంతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. తనీష్‌ జార్జికి కాంస్యం దక్కింది.
  • మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కెనిషా గుప్తా స్వర్ణం, శివాని కటారియా రజతం గెలిచారు.
  • పురుషుల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో ఎస్‌పీ లిఖిత్, ధనుష్‌ రజత, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల ఇదే ఈవెంట్‌లో చాహత్‌ అరోరా... బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
  • మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో దివ్య స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో ఆదిత్య రజతం గెలిచాడు.
  • మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో సువన పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

ఎనిమిదేళ్ల నిషే«ధానికి గురైన క్రికెట్‌ కోచ్‌?

జింబాబ్వే క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, కోచ్‌ హీత్‌ స్ట్రీక్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్ట్రీక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ ఏప్రిల్‌ 14న ప్రకటించింది. 2029 మార్చి 28వ తేదీతో ఎనిమిదేళ్ల నిషేధం ముగుస్తుందని తెలిపింది. ఈ నిషేధ సమయంలో స్ట్రీక్‌ ఏ రకమైన క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
47 ఏళ్ల హీత్‌ స్ట్రీక్‌ జింబాబ్వే తరఫున 65 టెస్టుల్లో, 189 వన్డేల్లో బరిలోకి దిగాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసిన అతను 1,990 పరుగులు చేశాడు. వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టిన స్ట్రీక్‌ 2,943 పరుగులు సాధించాడు. 2016– 2018 మధ్యకాలంలో స్ట్రీక్‌ జింబాబ్వే జాతీయ జట్టుకు, వివిధ టి20 లీగ్‌లలో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018 ఐపీఎల్‌లో స్ట్రీక్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.
జింబాబ్వే...
రాజధాని: హరారే; కరెన్సీ: జింబాబ్వే డాలర్‌
జింబాబ్వే ప్రస్తుత అధ్యక్షుడు: ఎమ్మర్సన్‌ మ్నన్‌గగ్వా
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఎనిమిదేళ్ల నిషే«ధానికి గురైన క్రికెట్‌ కోచ్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు : జింబాబ్వే క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, కోచ్‌ హీత్‌ స్ట్రీక్‌
ఎందుకు : అవినీతి నిరోధక నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు

ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌–2021ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌–2021 జరగనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ఏప్రిల్‌ 14న వెల్లడించింది. 2021, నవంబర్‌ 23 నుంచి 29 వరకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. కరోనా వైరస్‌ కారణంగా 2020 ఏడాది దక్షిణ కొరియాలో జరగాల్సిన టీటీ చాంపియన్‌షిప్‌ రద్దయిన విషయం తెలిసిందే.
భారత్‌ తీరు మారింది: యూఎస్‌ ఇంటెలిజెన్స్‌
పాకిస్తాన్‌ రెచ్చగొట్టే ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు మోదీ హయాంలోని భారత్‌ మిలటరీ పరంగా సత్వరమే స్పందించే అవకాశముందని, భారత్‌ తీరు గతంలో వలె లేదని అమెరికా నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏప్రిల్‌ 14న ఆ దేశ పార్లమెంటుకు సమర్పించిన ‘యాన్యువల్‌ త్రెట్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌(ఏటీఏఆర్‌)’లో ఈ మేరకు వెల్లడించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2021, నవంబర్‌ 23 నుంచి 29 వరకు ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌–2021
ఎప్పుడు : ఏప్రిల్‌ 14
ఎవరు : అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌)
ఎక్కడ : హ్యూస్టన్‌ నగరం, అమెరికా

హాకీ మాజీ ప్లేయర్‌ బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌ కన్నుమూత
టోక్యోలో జరిగిన 1958 ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు సభ్యుడు బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌(88) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఏప్రిల్‌ 13న చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు. బల్బీర్‌ 1951లో తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు. 962లో ఇండియన్‌ ఆర్మీలో చేరిన ఆయన జాతీయ టోర్నీలలో సర్వీసెస్‌ హాకీ జట్టు తరఫున పోటీపడ్డారు. 1984లో మేజర్‌ హోదాలో ఆర్మీ నుంచి రిటైరయ్యారు.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు ఎంపికైన క్రికెటర్‌?
భారత పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 2021, మార్చి నెలకుగానూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 13న ఐసీసీ ప్రకటించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : హాకీ మాజీ ప్లేయర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌(88)
ఎక్కడ : చండీగఢ్‌
ఎందుకు : గుండెపోటు కారణంగా...

ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి?
Current Affairs
2021, ఆగస్టు 18 నుంచి 29 వరకు చైనాలోని చెంగ్డూ నగరంలో జరగాల్సిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలను 2022 ఏడాదికి వాయిదా వేశారు. కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 2న అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్రీడా సమాఖ్య (ఎఫ్‌ఐఎస్‌యూ) తెలిపింది. వచ్చే ఏడాది చైనాలో మరో రెండు మెగా ఈవెంట్స్‌ ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌... 2022 సెప్టెంబర్‌లో హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 2022 ఏడాదికి ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు–2021 వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు : అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్రీడా సమాఖ్య (ఎఫ్‌ఐఎస్‌యూ)
ఎక్కడ : చెంగ్డూ నగరం, చైనా
ఎందుకు : కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో

ఐటీఎఫ్‌ టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ సాధించిన జంట?
ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌ కప్‌ జట్టు మాజీ సభ్యుడు సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో 22వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో సాకేత్‌ భారత్‌కే చెందిన అర్జున్‌ ఖడేతో జతగా ఆడి డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సాకేత్‌–అర్జున్‌లతో ఏప్రిల్‌ 3న జరగాల్సిన ఫైనల్లో తలపడాల్సిన సోంబోర్‌ వెల్జ్‌ (హంగేరి)–సిర్సినా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ బరిలోకి దిగకుండా ‘వాకోవర్‌’ ఇచ్చింది. దీంతో సాకేత్‌ జంటను విజేతగా ప్రకటించారు.
స్కేటింగ్‌లో తెలంగాణ బాలుర జట్టుకు స్వర్ణం
జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో క్యాడెట్‌ బాలుర విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. చండీగఢ్‌లో ఏప్రిల్‌ 2న జరిగిన ఫైనల్లో తెలంగాణ జట్టు 4–3 గోల్స్‌ తేడాతో హరియాణా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. తెలంగాణ జట్టులో శౌర్య, ఆదిత్య, హరికీర్తన్, కార్తీక్, అర్ణవ్, మారుతి కృష్ణన్, శ్యామల రితీశ్‌ రెడ్డి, మృదుల్‌ నారాయణ్, విక్షిత్‌ వర్ధన్, గులామ్‌ అహ్మద్‌ రజా ఖాన్, యథార్థ్‌ రావు, వీవీవీఎస్‌ఎస్‌ శాస్త్రి సభ్యులుగా ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ సాధించిన జంట?
ఎప్పుడు : ఏప్రిల్‌ 3
ఎవరు : సాకేత్‌ మైనేని–అర్జున్‌ ఖడే ద్వయం
ఎక్కడ : న్యూఢిల్లీ

ఐటీఎఫ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో నికీ కలియంద పునాచా (భారత్‌) విజేతగా నిలిచాడు. న్యూఢిల్లీలో ఏప్రిల్‌ 4న జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల నికీ పునాచా 6–3, 7–6 (7/5)తో నాలుగో సీడ్‌ ఒలీవర్‌ క్రాఫోర్డ్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. నికీ కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌. 2018లో తొలిసారి అతను ఇండోనేసియా ఫ్యూచర్స్‌–3 టోర్నీ టైటిల్‌ను గెలిచాడు.
మయామి ఓపెన్‌ మళ్లీ బార్టీదే...
ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మయామి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకుంది. బియాంక (కెనడా)తో జరిగిన ఫైనల్లో బార్టీ 6–3, 4–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. 2019లోనూ ఈ టోర్నీలో బార్టీ విజేతగా నిలిచింది. కరోనా కారణంగా 2020 ఏడాది ఈ టోర్నీ జరగలేదు. విజేతగా నిలిచిన బార్టీకి 3,00,100 డాలర్ల (రూ. 2 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఐటీఎఫ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 4
ఎవరు : కలియంద పునాచా (భారత్‌)
ఎక్కడ : న్యూఢిల్లీ

టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికైన మనూ భాకర్‌ ఏ క్రీడలో పోటీ పడనుంది?
టోక్యో ఒలింపిక్స్‌–2021లో పాల్గొనే భారత షూటింగ్‌ జట్టును ఏప్రిల్‌ 4న నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్‌లు సంపాదించారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన వారి వివరాలు...
పురుషుల విభాగం:
  • 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌: దివ్యాంశ్, దీపక్‌.
  • 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌: సంజీవ్‌ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌.
  • 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌: సౌరభ్‌ చౌధరీ, అభిషేక్‌ వర్మ.
  • స్కీట్‌ ఈవెంట్‌: అంగద్‌వీర్, మేరాజ్‌ అహ్మద్‌ఖాన్‌.
మహిళల విభాగం:
  • 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌: అపూర్వీ, ఇలవేనిల్‌.
  • 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌: అంజుమ్, తేజస్విని.
  • 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌: మనూ భాకర్, యశస్విని.
  • 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌: రాహీ, మనూ.
  • 10 మీటర్ల రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌: దివ్యాంశ్, ఇలవేనిల్‌.
  • 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌: సౌరభ్, మనూ భాకర్‌.
మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ విజేత?
మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ పురుషుల విభాగంలో పోలాండ్‌ ప్లేయర్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ చాంపియన్‌గా అవతరించాడు. అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రం డెల్‌రే బీచ్‌లో ఏప్రిల్‌ 5న జరిగిన ఫైనల్లో హుర్కాజ్‌ 7–6 (7/4), 6–4తో ఇటలీకి చెందిన 19 ఏళ్ల జానిక్‌ సినెర్‌పై గెలుపొందాడు. హుర్కాజ్‌ కెరీర్‌లో ఇదే తొలి మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన హుర్కాజ్‌కు 3,00,110 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 22 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
మూడు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలు రద్దు
అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో 2021 ఏడాది జరగాల్సిన మూడో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. జూన్‌లో జరగాల్సిన కెనడా ఓపెన్‌... జూలైలో జరగాల్సిన రష్యా ఓపెన్‌... అక్టోబర్‌లో జరగాల్సిన ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీలు రద్దయినట్లు బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ(పురుషుల విభాగం) విజేత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 5
ఎవరు : హుబర్ట్‌ హుర్కాజ్‌
ఎక్కడ : డెల్‌రే బీచ్, ప్లోరిడా రాష్ట్రం, అమెరికా

బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా నియమితులైన మాజీ డీజీపీ?
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌గా గుజరాత్‌ మాజీ డీజీపీ షబ్బీర్‌ హుస్సేన్‌ షెకాదమ్‌ను నియమించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న అజిత్‌ సింగ్‌ స్థానంలో షబ్బీర్‌ బాధ్యతలు చేపడతారని ఏప్రిల్‌ 5న బీసీసీఐ తెలిపింది. మూడేళ్ల నాటినుంచి ఏసీయూ చీఫ్‌గా పని చేస్తున్న అజిత్‌ సింగ్‌ పదవీ కాలం మార్చి 31న ముగిసింది. 2010లో రిటైర్‌ అయిన 70 ఏళ్ల షబ్బీర్‌ హుస్సేన్‌ పదేళ్ల పాటు ఎసార్‌ గ్రూప్‌లో సలహాదారుడిగా పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ లోక్‌పాల్‌ సెర్చ్‌ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్‌ 5
ఎవరు : గుజరాత్‌ మాజీ డీజీపీ షబ్బీర్‌ హుస్సేన్‌ షెకాదమ్‌
ఎందుకు : ఏసీయూ చీఫ్‌గా పని చేస్తున్న అజిత్‌ సింగ్‌ పదవీ కాలం మార్చి 31న ముగియడంతో...

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2021లో ఏ క్రీడను చేర్చారు?
దేశంలో హ్యాండ్‌బాల్‌కు విశేష ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగు పడింది. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2021లో హ్యాండ్‌బాల్‌ను క్రీడాంశంగా చేర్చినట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర క్రీడల మంత్రిగా కిరణ్‌ రిజిజు, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా నరీందర్‌ బాత్ర, భారత హ్యాండ్‌ బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌ రావు ఉన్నారు.
కేంద్రానికి న్యూమోకాకల్‌ వ్యాక్సిన్‌..
న్యూమోనియా, సెప్టుసీమియా, మెనుంజైతిహ్‌ వంటి ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడే ‘‘న్యూమోనికాకల్‌ కాంజుగేట్‌’’ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. భారత ప్రభుత్వానికి ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి పంపిణీ చేయనుంది. ఈ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ దేశీయంగా తయారు చేసింది. సీరం సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం... 2021 డిసెంబర్‌ నాటికి 2.4 కోట్ల వ్యాక్సిన్లను అందించాల్సి ఉంటుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2021లో క్రీడాంశంగా హ్యాండ్‌బాల్‌ చేరిక
ఎప్పుడు : ఏప్రిల్‌ 6
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
ఎందుకు : దేశంలో హ్యాండ్‌బాల్‌కు విశేష ఆదరణ కల్పించేందకు

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోవడం లేదని ప్రకటించిన దేశం?
2021 జూలై, ఆగస్టు నెలల్లో జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ క్రీడల్లో తమ దేశం పాల్గొనబోవడం లేదని ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌ 6న ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్‌ 2020 జూలై, ఆగస్టులలో జరగాల్సింది. అయితే కరోనా వైరస్‌తో ఈ మెగా క్రీడలను 2021 జూలై, ఆగస్టుకు వాయిదా వేశారు.
మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో...
1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన ఉత్తర కొరియా ఆ తర్వాత రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంది. అనంతరం రాజకీయ కారణాలతో 1984 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్, 1988 సియోల్‌ ఒలింపిక్స్‌ క్రీడలను ఉత్తర కొరియా బహిష్కరించింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పునరాగమనం చేశాక 2016 రియో ఒలింపిక్స్‌ వరకు ఉత్తర కొరియా బరిలోకి దిగింది.
ఉత్తర కొరియా...
రాజధాని: ప్యాంగ్‌ యాంగ్‌; కరెన్సీ: నార్త్‌ కొరియన్‌ వన్‌
ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు: కిమ్‌ జోంగ్‌ ఉన్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌–2021లో పాల్గొనబోవడం లేదని ప్రకటించిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 6
ఎవరు : ఉత్తర కొరియా
ఎక్కడ : టోక్యో, ఒలింపిక్స్‌
ఎందుకు : ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు

2021 ఆసియా మహిళల బాక్సింగ్‌ టోర్నీ ఏ నగరంలో జరగనుంది?
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో 2021, మే 21 నుంచి 31 వరకు ఆసియా మహిళల బాక్సింగ్‌ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఏప్రిల్‌ 7న ప్రకటించారు. స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు) ఏడో పతకం లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జట్టులోకి ఎంపికైన ఇతర బాక్సర్లలో... మోనిక (48 కేజీలు), సాక్షి (54 కేజీలు), జాస్మిన్‌ (57 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు), బసుమతారి (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), సవీటి (81 కేజీలు), అనుపమ (ప్లస్‌ 81) ఉన్నారు. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి.
ఉగాండాలో శిక్షణకు అవినాశ్‌...
స్టీపుల్‌చేజ్‌ 3వేల మీటర్ల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్‌ అవినాశ్‌ సాబ్లే ఉగాండాలో ఏప్రిల్‌ 10 నుంచి జూలై 20 వరకు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. లాంగ్‌డిస్టెన్స్‌ రన్నింగ్‌లో ఆఫ్రికా దేశాలకు మేటి అథ్లెట్స్‌ను అందించిన చరిత్ర ఉంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ అవినాశ్‌ శిక్షణ కోసం రూ. 28,95,150 విడుదల చేసింది.
ఉగాండా...
రాజధాని: కంపాలా; కరెన్సీ: ఉగాండా షిల్లింగ్‌
ఉగాండా ప్రస్తుత అధ్యక్షుడు: యోవేరి కగుటా ముసేవేని
ఉగాండా ప్రస్తుత ప్రధాని: రుహకన రుగుండ

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌?
సెయిలింగ్‌ క్రీడాంశం మహిళల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ సెయిలర్‌గా తమిళనాడుకు చెందిన నేత్రా కుమనన్‌ ఏప్రిల్‌ 7న రికార్డు రికార్డు సృష్టించింది. చెన్నైకి చెందిన 23 ఏళ్ల నేత్ర ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో పోటీపడుతోంది. ఏప్రిల్‌ 7న రేసులు ముగిశాక 21 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్‌ 8న జరిగే చివరి రోజు రేసుల తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేత్రకు ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారైంది. మరో రేసు మిగిలి ఉండగానే నేత్ర కుమనన్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
ఇప్పటివరకు తొమ్మిది మంది...
ఇప్పటివరకు భారత్‌ నుంచి సోలీ కాంట్రాక్టర్, బాసిత్‌ (1972 మ్యూనిక్‌), ధ్రువ్‌ భండారి (1984 లాస్‌ ఏంజెలిస్‌), కెల్లీ రావు (1988 సియోల్‌), ఫారూఖ్‌ తారాపూర్, సైరస్‌ కామా (1992 బార్సిలోనా), మాలవ్‌ ష్రాఫ్, సుమీత్‌ పటేల్‌ (2004 ఏథెన్స్‌), నచ్తార్‌ సింగ్‌ జోహల్‌ (2008 బీజింగ్‌) సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. వీరందరూ పురుషులే.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌?
ఎప్పుడు : ఏప్రిల్‌ 7
ఎవరు : నేత్రా కుమనన్‌
ఎందుకు : ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు

ఐపీఎల్‌–2021కు టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంస్థ?
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో తన ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని నియమించుకుంది. వివో స్మార్ట్‌ఫోన్లతో పాటు కంపెనీ చేపట్టే ఈవెంట్లు, టీవీ, ప్రింట్, ఔట్‌డోర్, సోషల్‌ మీడియా తదితర అన్ని రకాల మాధ్యమాల్లోనూ కోహ్లీ ప్రచారం ఉంటుంది. 2021, ఏప్రిల్‌ 9 నుంచి జరగనున్న ఐపీఎల్‌–2021కు టైటిల్‌ స్పాన్సర్‌గా వివో వ్యవహరిస్తుంది.
యప్‌టీవీకి ప్రసార హక్కులు...
దక్షిణాసియా కంటెంట్‌లో ప్రపంచంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ యప్‌టీవీ.. వివో ఐపీఎల్‌–2021 డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకుంది. భారత్‌తో పాటు మొత్తం వంద దేశాలలోని క్రికెట్‌ అభిమానులకు ఐపీఎల్‌ క్రికెట్‌ను యప్‌ టీవీ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది.
Published date : 16 Apr 2021 05:38PM

Photo Stories