Skip to main content

Retirement From Cricket: క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన దిగ్గజ పేసర్‌?

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా నిలిచిన దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ ఆటకు వీడ్కోలు పలికాడు.
Dale Steyn
డేల్‌ స్టెయిన్‌

రెండేళ్ల క్రితమే టెస్టుల నుంచి తప్పుకున్న 38 ఏళ్ల స్టెయిన్‌ ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆగస్టు 31న ప్రకటించాడు. సుమారు 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో స్టెయిన్‌ మూడు ఫార్మాట్‌లలో కలిపి 699 వికెట్లు పడగొట్టడం విశేషం. సఫారీలు సాధించిన 42 వన్డే సిరీస్‌ విజయాల్లో 28 సిరీస్‌లలో స్టెయిన్‌ భాగస్వామి. 2011, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన అతను 2009 నుంచి 2016 వరకు 5 టి20 ప్రపంచకప్‌లలో బరిలోకి దిగాడు. ఐపీఎల్‌లో అతను హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్‌ జట్ల తరఫున ఆడాడు. వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు.

  మ్యాచ్‌లు వికెట్లు  సగటు
టెస్టులు     93 439    22.95
వన్డేలు 125 196 25.95
టి20లు 47  64 18.35

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆల్‌రౌండర్‌?
భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల బిన్నీ భారత్‌ తరఫున 6 టెస్టులు (194 పరుగులు; 3 వికెట్లు), 14 వన్డేలు (230 పరుగులు; 20 వికెట్లు), 3 టి20లు (35 పరుగులు; ఒక వికెట్‌) ఆడాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన దిగ్గజ పేసర్‌?
ఎప్పుడు  : ఆగస్టు 31
ఎవరు    : దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ 
ఎందుకు : వ్యక్తిగత కారణాల వల్ల...
 

Published date : 01 Sep 2021 06:33PM

Photo Stories