Skip to main content

CWG 2022 : లానా బౌల్స్ లో భారత్ కు స్వర్ణం

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడలు 2022లో ఆగస్టు 2న భారత్‌ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి.
CWG 2022: Meet the ladies who won India's historic lawn
CWG 2022: Meet the ladies who won India's historic lawn

లాన్‌ బౌల్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. లవ్లీ, పింకీ, రూప, నయన్‌మోని సభ్యులుగా ఉన్న ‘ఫోర్స్‌’ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. ఫైనల్లో భారత్‌ 17–10 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 

Also read: Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు

టేబుల్‌ టెన్నిస్‌లో పురుషుల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ హవా కొనసాగింది. ఫైనల్లో భారత్‌ 3–1 తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌ డబుల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌–సత్యన్‌ జోడీ 13–11, 11–7, 11–5తో యాంగ్‌ క్విక్‌–కూన్‌ పాంగ్‌పై గెలుపొందింది. అయితే ఆ తర్వాత సింగిల్స్‌లో భారత టాప్‌ ఆటగాడు ఆచంట శరత్‌ కమల్‌ అనూహ్యంగా 7–11, 14–12, 3–11, 9–11తో క్లారెన్స్‌ చూ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో సింగిల్స్‌లో సత్యన్‌ 12–10, 7–11, 11–7, 11–4తో ఎన్‌ కూన్‌ పాంగ్‌ను చిత్తు చేశాడు. ఆ తర్వాత కీలకమైన మూడో సింగిల్స్‌లో సత్తా చాటిన హరీ్మత్‌ దేశాయ్‌ 11–8, 11–5, 11–6తో క్లారెన్స్‌ చూపై గెలుపొంది భారత్‌కు స్వర్ణం ఖాయం చేశాడు.

Also read: CWG 2022 : 11 స్వర్ణాల మెక్ కియోన్

భారత సీనియర్‌ వెయిట్‌లిఫ్టర్‌ వికాస్‌ ఠాకూర్‌ వరుసగా మూడో కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ పతకంతో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్‌ రజత పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన వికాస్‌ మొత్తం 346 కేజీలు (స్నాచ్‌లో 155+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 191) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. డాన్‌ ఒపెలోజ్‌ (సమోవా; 381 కేజీలు) స్వర్ణం, టానియెలా ట్యుసువా (ఫిజీ; 343 కేజీలు) కాంస్యం గెలిచారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో రజతం నెగ్గిన వికాస్‌... 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 94 కేజీల విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 2nd కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Aug 2022 06:48PM

Photo Stories