తెలంగాణ కుర్రాడు రాహుల్ శ్రీవాత్సవ్ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ జీఎం హోదా సాధించాడు. భారత 74వ జీఎంగా అతను నిలిచాడు. తెలంగాణ నుంచి అర్జున్ ఇరిగేశి, హర్ష భరత్‌కోటి, రాజా రిత్విక్ తర్వాత నాలుగో జీఎంగా రికార్డు సృష్టించాడు. ‘‘100 గ్రాండ్ మాస్టర్ల సంఖ్యను చేరుకునే దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. ఈ అరుదైన క్లబ్బులోకి తాజాగా తెలంగాణకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు రాహుల్ శ్రీవాత్సవ్ చేరాడు.
Weightlifting: యూత్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో గురునాయుడు సత్తా
మెక్సికోలోని లెయాన్ లో జరుగుతున్న యూత్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 55 కిలోల విభాగంలో గురునాయుడు స్వర్ణం గెలుచుకున్నాడు.