Skip to main content

Chess Olympiod : భారత జట్లకు కాంస్య పతకాలు

భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్లకి రెండు కాంస్య పతకాలు దక్కాయి.
Chess Olympiad Bronze medals for Indian teams
Chess Olympiad Bronze medals for Indian teams

ఆగస్టు 8న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్‌ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్‌ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్‌ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి.  

Also read: CWG 2022: రెజ్లింగ్ లో భారత్ కు 3 స్వర్ణాలు

నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్‌ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 6th కరెంట్‌ అఫైర్స్‌

చివరిదైన 11వ రౌండ్‌లో భారత్‌ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్‌ తమ ప్రత్యర్థులపై గెలిచారు.  

Also read: Indian Citizenship: మూడేళ్లలో 3,92,643 మంది పౌరసత్వం వదులుకున్నారు

మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. చివరిదైన 11వ రౌండ్‌లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్‌ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్‌ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్‌ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. 

Also read: World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం

క్లాసికల్‌ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్‌ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో పరిమార్జన్‌ నేగి, సేతురామన్, కృష్ణన్‌ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్‌ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్‌ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్‌ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్‌లైన్‌ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్‌లైన్‌లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్‌ కాంస్యం సాధించింది.   

Also read: Indian Navy : నేవీలో నారీ ఘనత..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Aug 2022 06:21PM

Photo Stories