Indian Citizenship: మూడేళ్లలో 3,92,643 మంది పౌరసత్వం వదులుకున్నారు
Sakshi Education
![How many give up Indian citizenship](/sites/default/files/images/2022/08/06/indian-citizenship-1659787881.jpg)
గత మూడేళ్లలో 3,92,643 మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో 1,70,795 (43.49%) మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఇదే సమయంలో కెనడా పౌరసత్వాన్ని 64,071(16.31%) మంది, ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని 58,391(14.87%), యూకే పౌరసత్వం 35,435 (9.02%) మంది తీసుకున్నట్లుగా గుర్తించారు . ఈ నాలుగు దేశాల పౌరసత్వం తీసుకున్న మొత్తం భారతీయుల సంఖ్య 3,28,692 (83.71%) మేర ఉన్నట్లు హోమ్ శాఖ వెల్లడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 06 Aug 2022 05:41PM