Skip to main content

Davis Cup: కెనడాకు డేవిస్‌కప్‌ టైటిల్‌

ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది.

స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆ్రస్టేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో షపోవలోవ్‌ 6–2, 6–4తో కొకినాకిస్‌పై నెగ్గగా, రెండో సింగిల్స్‌లో ఫెలిక్స్‌ అలియాసిమ్‌ 6–3, 6–4తో అలెక్స్‌ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్‌ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్‌ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది.

ATP Rankings: వరల్డ్‌ యంగెస్ట్‌ ఏటీపీ ప్లేయర్‌గా కార్లోస్‌ అల్కరాజ్‌

Published date : 29 Nov 2022 01:08PM

Photo Stories