Skip to main content

Azhar Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన‌ అజహర్‌ అలీ

పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాడు, టెస్టు స్పెషలిస్ట్‌ అజహర్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

డిసెంబ‌ర్ 17 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టు అజహర్‌ కెరీర్‌లో చివరిది కానుంది. వంద టెస్టుల మైలురాయికి మూడు మ్యాచ్‌ల ముందే అతను తప్పుకుంటున్నాడు. కెరీర్‌లో 96 టెస్టులు ఆడిన అతను 42.49 సగటుతో 7097 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 302 నాటౌట్‌ అజహర్‌ అత్యధిక స్కోరు. పాక్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంతో అజహర్‌ కెరీర్‌ ముగిస్తున్నాడు. 53 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించినా అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ ఫార్మాట్‌లో 36.90 సగటుతో 1845 పరుగులు సాధించిన అలీ 3 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.   

New Zealand: టెస్టు కెప్టెన్సీకి విలియమ్సన్‌ గుడ్‌బై

Published date : 17 Dec 2022 05:39PM

Photo Stories