New Zealand: టెస్టు కెప్టెన్సీకి విలియమ్సన్ గుడ్‌బై
Sakshi Education
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతల నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు.
రానున్న రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో వన్డే, టి20 కెప్టెన్‌గా మాత్రం అతను కొనసాగుతాడు. పని ఒత్తిడి కారణంగానే టెస్టు కెప్టెన్సీని వదులుకున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. 2016లో బ్రెండన్ మెకల్లమ్ రిటైర్మెంట్ తర్వాత నాయకుడిగా ఎంపికైన కేన్.. 40 టెస్టుల్లో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడంతో పాటు తొలి టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలపడం విలియమ్సన్ కెప్టెన్సీలో అత్యుత్తమ క్షణం. డిసెంబర్ 26 నుంచి పాకిస్తాన్‌తో కరాచీలో జరిగే తొలి టెస్టు నుంచి సౌతీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. కెరీర్‌లో 88 టెస్టులు ఆడి 347 వికెట్లు పడగొట్టిన సౌతీ.. 1,855 పరుగులు చేశాడు. అతను ఇప్పటికే 22 టి20లు, ఒక వన్డే మ్యాచ్‌లో కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ICC ODI Rankings: డబుల్ సెంచరీతో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్ కిషన్..!
Published date : 16 Dec 2022 03:21PM