Skip to main content

Commonwealth Games Federation: కామన్వెల్త్‌ గేమ్స్‌లో తప్పనిసరి క్రీడాంశాలు ఏవి?

Commonwealth Games

భవిష్యత్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ)లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు 2026–2030కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను అక్టోబర్‌ 12న కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) జనరల్‌ అసెంబ్లీ అమోదించింది. ఈ రోడ్‌మ్యాప్‌ ప్రకారం...

  • 2026 నుంచి జరిగే సీడబ్ల్యూజీలో క్రీడాంశాల సంఖ్య తగ్గనుంది. వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 2026 నుంచి క్రీడాంశాల సంఖ్య 15కు తగ్గనుంది. 
  • 2026 నుంచి ఉండే 15 క్రీడాంశాల్లో అథ్లెటిక్స్, అక్వాటిక్స్‌ (స్విమ్మింగ్‌) మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇక మిగిలిన క్రీడాంశాలను కొనసాగించే నిర్ణయాన్ని ఆతిథ్య దేశానికి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 
  • ఇక ఆప్షనల్‌ గ్రూప్‌లో ఉన్న క్రికెట్, 3్ఠ3 బాస్కెట్‌బాల్, బీచ్‌ వాలీబాల్‌లను కోర్‌ గ్రూప్‌లోకి మార్చారు.

అందుకే ఈ నిర్ణయం...

కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు సీజీఎఫ్‌ అధ్యక్షురాలు డెమె లూసీ మార్టిన్‌ తెలిపారు. తాజా మార్పులతో గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలకు లబ్ధి జరగనుంది. తాము ఏ క్రీడాంశాల్లో పతకాలను ఎక్కువగా గెలవగలమో వాటికి ఆ దేశాలు పెద్ద పీట వేస్తాయి. 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌ వేదిక ఇంకా ఖరారు కాలేదు. సీజీఎఫ్‌ ప్రధాన కార్యాలయం ఇంగ్లండ్‌లోని లండన్‌లో ఉంది.
 

చ‌ద‌వండి: బల్గేరియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారతీయురాలు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కామన్వెల్త్‌ గేమ్స్‌కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌: 2026–2030కు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్‌ 12
ఎవరు    : కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) జనరల్‌ అసెంబ్లీ
ఎక్కడ    : లండన్, ఇంగ్లండ్‌
ఎందుకు : కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 13 Oct 2021 03:41PM

Photo Stories