Skip to main content

Asian Games 2022: ఆసియా క్రీడలను తొలిసారి ఎక్కడ నిర్వహించారు?

Asian Games 2022

పోటీతత్వం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలను ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) ఆహ్వానించింది. ఈ రెండు దేశాల కోసం 300 అథ్లెట్ల కోటా కింద ఒక్కో దేశానికి 150 మంది చొప్పున పంపాలని ఓసీఏ కోరింది. అయితే ఓసీఏ ఆహ్వానాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఒలింపిక్‌ కమిటీలు తిరస్కరించాయి. ఆసియా క్రీడల్లో తమ దేశాల క్రీడాకారులను పంపించలేమని తెలిపాయి.

GK International Quiz: US సైన్యం బాలికాటన్ 2022 అనే మిలిటరీ డ్రిల్‌ను ఏ దేశంతో కలిసి నిర్వహించింది?

ఆసియా క్రీడలు–2022..
ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్స్‌ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో(న్యూఢిల్లీ) జరిగాయి. 19వ ఆసియా క్రీడలు–2022 చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా.. 2022 ఏడాది సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి.

టీకా తప్పనిసరి కాదు..
ప్రపంచ టెన్నిస్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌లాంటి స్టార్‌ ప్లేయర్లు కోవిడ్‌ టీకా తీసుకోకపోయినా 2022 ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో ఆడనిస్తామని ‘ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌’ స్పష్టం చేసింది. అలాగే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ కోర్టు నుంచి ‘కోవిడ్‌ ప్రొటోకాల్‌’ కూడా అవుట్‌ అయింది. దీంతో క్వారంటైన్, నిర్బంధ టెస్టులు, నిబంధనలు ఈసారి ఉండబోవు. ప్రేక్షకులు రెండేళ్ల తర్వాత తమకెంతో ఇష్టమైన వింబుల్డన్‌ టోర్నీలో మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. కరోనాతో 2020 వింబుల్డన్‌ టోర్నీ రద్దవగా, గతేడాది టోర్నీని ప్రేక్షకుల్లేకుండా నిర్వహించారు.

Table Tennis: టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Apr 2022 03:01PM

Photo Stories