Aryna Sabalenka : ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల గ్రాండ్‌స్లామ్ విజేత అరినా సబలెంకా.. మ్యాచ్ జరిగిందిలా..
Sakshi Education
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల గ్రాండ్‌స్లామ్ విజేతగా బెలారస్‌కు చెందిన వరల్డ్ నెంబర్ రెండో ర్యాంకర్ అరినా సబలెంకా నిలిచింది. జనవరి 28వ తేదీ (శనివారం) కజకిస్తాన్‌కు చెందిన పదో ర్యాంకర్ రిబాకినాతో జరిగిన ఫైనల్లో సబలెంకా.. 4-6, 6-3,6-4 తేడాతో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
aryna sabalenka australian open 2023 winner
సబలెంకాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫైనల్ చేరిన తొలి క్రమంలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సబలెంకా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను ఒడిసిపట్టింది.
తొలిసెట్‌ను సబలెంకా 4-6 తేడాతో రిబాకినాకు కోల్పోయింది. అయితే ఆ తర్వాత రెండో సెట్‌లో ఫుంజుకున్న సబలెంకా బలమైన సర్వీస్ షాట్లతో పాటు ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. 6-3 తేడాతో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్‌లోనూ రిబాకినాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో సెట్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని విజేతగా నిలిచింది.