Abu Dhabi Masters Chess: విజేత అర్జున్
యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఆగష్టు 25 న ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రోహిత్‌కృష్ణ, దీప్‌సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీనలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Also read: Guinness World Records: మాక్ రూథర్‌ఫర్డ్ వయసు 17 ఏళ్లు.. ప్రపంచం చుట్టేశాడు..
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP