Turkey: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో స్వర్ణం గెలిచిన జట్టు?
టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్–2022లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఏప్రిల్ 23న జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్, అమన్ సైనీ, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. జీన్ ఫిలిప్, బేరర్, అడ్రియన్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ 232–231తో విజయం సాధించింది.
Wrestling: ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయుడు?
ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్–2022లో భారత్‌కు తొలి పతకం లభించింది. ఇటలీ వేదికగా ఏప్రిల్ 23న జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, వివాన్ కపూర్, పృథ్వీరాజ్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో భారత్ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
Wrestling: భారత క్రీడాకారిణి అన్షు మలిక్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్–2022లో స్వర్ణం గెలిచిన జట్టు?
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : రజత్ చౌహాన్, అమన్ సైనీ, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు
ఎక్కడ : అంటాల్యా, టర్కీ
ఎందుకు : పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టు 232–231తో జీన్ ఫిలిప్, బేరర్, అడ్రియన్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టుపై గెలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్