Skip to main content

National Games 2022: జ్యోతి ఖాతాలో రెండో స్వర్ణం

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యెర్రాజీ మళ్లీ మెరిసింది.
AP Athlete Jyothi Yarraji Clinches Gold
AP Athlete Jyothi Yarraji Clinches Gold

ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈ వైజాగ్‌ అథ్లెట్‌ 100 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. అక్టోబర్ 4న జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును జ్యోతి 12.79 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. 

Also read: World Cadet Chess లో శుభి, చార్వీలకు స్వర్ణాలు

తెలంగాణకు చెందిన అగసార నందిని 13.38 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది. 
మహిళల జావెలిన్‌ త్రోలో రష్మీ శెట్టి ఆంధ్రప్రదేశ్‌కు రజత పతకం అందించింది. రష్మీ జావెలిన్‌ను 53.95 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. 
టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో కొసరాజు శివదీప్‌–ముని అనంత్‌మణి (ఆంధ్రప్రదేశ్‌) జోడీ కాంస్య పతకం సాధించింది. 
సెమీఫైనల్లో శివదీప్‌–అనంత్‌మణి ద్వయం 7–5, 3–6, 6–10తో ప్రజ్వల్‌ దేవ్‌–ఆదిల్‌ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: U-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లింగ్ జట్టు ఎన్ని పతకాలు సాధించింది?

Published date : 06 Oct 2022 06:38PM

Photo Stories