జార్జియాలోని బాతూమిలో జరుగుతున్న ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
Charvi Anilkumar and Shubhi Gupta clinch Gold at World
సెప్టెంబర్ 27న ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు.